Monday, 2 November 2026

నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి

మునుగోడు : కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగిక దాడికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం తన కుమార్తెను ఎవరో అపహరించుకు వెళ్లారంటూ నాటకం ఆడాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయం బయటపడింది. మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన కొండ యాదయ్య బతుకుదెరువుకోసం 20 రోజుల క్రితం మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి వచ్చి బొంతలు కుట్టుకుంటూ అక్కడే బస్‌షెల్టర్‌ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున తన నాలుగు సంవత్సరాల పెద్ద కుమార్తెను గ్రామానికి రెండు కి.మీ దూరంలోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *