Monday, 2 November 2026

మళ్లి సమైక్య గళం ఎత్తిన సీఎం కిరణ్‌

విశాఖపట్న ం : సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంద్రలో సమైక్యవాదిని అనిపించుకోవడానికి ఉభలాటపడుతున్నాడు. వరద ప్రాంతంలో బురద రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఈ రోజు ఉదయం ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా విశాఖపట్నంలో ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సీఎం చరిత్రకు వక్రబాష్యం చెప్పారు. 1969 ,1972 ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. తాను ఇప్పటి వరకు ఇందిరాగాంధీ అన్న సమైక్యవాదం మాటలనే మాట్లాడినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఇందిరా పార్లమెంట్‌లో మాట్లాడారని కిరణ్‌ తెలిపారు. ఇందిరాగాంధీ తన చివరి రక్తపు బొట్టు వరకూ దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారని ,ఇందిరాగాంధీ మరణం వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి నెలకొందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *