Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించం : దేవీప్రసాద్‌


టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దేేవీప్రసాద్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించబోమని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ పై పెత్తనాన్ని మాత్రం తమవద్దే ఉంచుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హెచ్చరించారు. ఈమేరకు సచివాలయంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌పై గవర్నర్‌ పాలనను సహించ బోమన్నారు. తెలంగాణపై కేంద్రానికి ¬ంశాఖకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా బోగస్‌దిగా అభివర్ణించారు. నివేదిక పూర్తిగా తప్పుల తడకన్నారు.  కేంద్ర ¬ంశాఖకు నివేదిక పంపించిన అధికారుల పేర్లను బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ¬ంశాఖ పంపించిన నివేదిక పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా ఉందని విమర్శించారు. ఈనెల 11, 12 తేదీల్లో న్యూఢిల్లీకి వెళ్తున్నామని, ఆసందర్భంగా కేంద్రానికి చెందిన మంత్రులను, పెద్దలను కలుస్తామన్నారు. అలాగే జాతీయ పార్టీల నేతలను కూడా కలుస్తామన్నారు. తొలుత చెప్పినట్లుగా హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను మాత్రమే తెలంగాణ వాదులు అంగీకరిస్తారని, ఏమాత్రం తేడా వచ్చినా కూడా మరో ఉగ్ర ఉద్యమం చవి చూడక తప్పదని దేవీ ప్రసాద్‌ హెచ్చరించారు. నిబందనలకు విరుద్దంగా ఉంటున్న సీమాంధ్రులను ఖచ్చితంగా సాగనంపాల్సిందేనన్నారు. వేరే రాష్ట్రానికి చెందిన వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో లోకల్‌ వారిగా పరిగణించేలా చర్యలు తీసుకోవడం దుర్మార్గమే అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న హెల్త్‌ కార్డుల విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఔట్‌ పేషంట్‌ విధానంలో క్లారిటీలేదన్నారు. రోగ నిర్దారణకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించుకోవాలన్నారు. అలాగే 610 జిఓను తుంగలో తొక్కిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *