Wednesday, 4 November 2026

బంగాళఖాతంలో మరో అల్పపీడనం

విశాఖపట్నం : బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళఖాతాన్ని అనుకుని మధ్య బంగాళఖాతం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది స్థిరంగా ఉంది. మరో రెండు రోజుల్లో మరింత బలపడే అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది తీరానికి సమీపించే కొద్దీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల మధ్య రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *