తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి ధర్మ దర్శనానికి 4, ప్రవేశ దర్శనానికి 2, కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట, దివ్యదర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. స్వామివారి సన్నిధిలో లఘు దర్శనం అమలవుతోంది. ఉదయం స్వామివారికి అష్ఠపాదపద్మారాధన సేవ జరిగింది.




