Tuesday, 3 November 2026

తుస్సుమన్న సమైక్య రాజకీయ సదస్సు

వైకాపా, ఎంఐఎం డుమ్మా
కలిసి పనిచేయమన్న సీపీఎం
హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే అసంబద్ధమైన డిమాండ్‌తో రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిద్దామనుకున్న ఏపీఎన్‌జీవోలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే పార్టీలతో శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విభేదాలు బట్టబయలయ్యాయి. ఏపీఎన్‌జీవోల్లోనే చీలిక వచ్చింది. ఆ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై సొంత సంఘం నాయకులే ఎదురుదాడికి దిగారు. ఎవరికి చెప్పి సభ పెట్టావని ప్రశ్నించారు. మరోవైపు అఖిలపక్ష భేటీకి ఆహ్వానించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐఎం డూమ్మా కొట్టాయి. సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు కలిసి ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)గా ఏర్పడాలని ఏపీఎన్‌జీవోలు కోరినా సీమాంధ్ర నేతలు ససేమిరా అన్నారు. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగా, ఇప్పుడు జేఏసీగా ఏర్పడితే రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీమాంధ్ర నేతలు కరాఖండిగా చెప్పేశారు. దీంతో సమైక్య రాష్ట్రం కోసం ఐక్య పోరాటాలు సాగిద్దామని ఏపీఎన్‌జీవోలు కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఒటంటరి పోరు చేస్తామని సిపిఎం, లోక్‌సత్తా ప్రకటించాయి. టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ… విభజన బిల్లును వ్యతిరేకించడంపై రాజకీయ పార్టీలన్నీ సమైక్యంగా ముందు కెళ్లాలని కోరారు. మంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ… క్లిష్టమైన పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఏపీఎన్జీవో ¬ంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సబ్బం హరి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల అఫిడవిట్లు చూసిన తర్వాత రాష్ట్రపతి పునరాలోచిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున విభజన ద్వారా లబ్దిపొందాలని జాతీయ పార్టీలు భావిస్తున్నాయని విమర్శించారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా జర్చ జరగాలని, అందరి అభిప్రాయాలు చెప్పాల్సిందేనన్నారు. ఆందోళనల్లో అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఒక నిర్ణయం తీసుకున్న పార్టీలను ప్రశ్నించలేమన్నారు. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, సీఎం రమేష్‌, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, కె.ఇ. ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నుంచి మంత్రి శైలజానాథ్‌, ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సీపీఎం నుంచి పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, వై.వెంకటేశ్వరరావు, లోక్‌సత్తా నుంచి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రవి మారుత్‌ హాజరయ్యారు. ఇదిలావుంటే ఏపీఎన్జీవో ¬మ్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అబిడ్స్‌ నుంచి ఏపీఎన్జీవో ¬మ్‌కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ వాదులు దాడి చేయవచ్చన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *