Monday, 2 November 2026

వైష్ణవ ఆలయాలకు సందర్శనకు ఆర్టీసీ ఒకరోజు టూర్‌ ప్యాకేజీ

మంగళ్‌ దాస్‌ నగర్‌, గుంటూరు: గుంటూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌ నుంచి ధనుర్మాసం సందర్భంగా వైష్ణవ ఆలయాలను దర్శించడానికి ఒకరోజు టూర్‌ ప్యాకేజీ విధానం ఏర్పాటు చేసినట్లు ఆర్‌ ఎం రామారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం బస్సులు వెళ్లే టూరు వివరాలతో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. గుంటూరు ప్రధాన బస్టాండు నుంచి మంగళగిరి పానకాలస్వామి, సింహాచలం దేవస్ధానం, తిరుగు ప్రయాణంలో అన్నవరం, ద్వారకాతిరుమల తదితర నాలుగు వైష్ణవ దేవాలయాలను చూపించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ ధనుర్మాసంలో శుక్ర, శని వారాలు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కవ మంది ప్రయాణీకులు కోరితే ఇతర రోజుల్లోనూ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *