Wednesday, 4 November 2026

నూనె పరిశ్రమలో అగ్నిప్రమాదం

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామిక వాడలోని కల్పధ్రువ జీడి నూనె మిల్లులో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటికి పరుగులు తీశారు. పరిశ్రమ నుంచి మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతంలోని జీడి పరిశ్రమలోని కార్మికులు సైతం బయటికి పరుగులు తీశారు. కాశాబుగ్గ, సోంపేట నుంచి వచ్చిన అగ్నిమాపక దళాలు మంటలను ఆపే ప్రయత్నం చేపట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *