ముంబై, జనవరి 10 (జనంసాక్షి) :
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ -2 టర్మినల్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మెట్రో నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. విమానాశ్రయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. పురి విప్పిన నెమలి ఆకారంలో 13 ఎకరాల్లో టీ-2 టర్మినల్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధితో పాటు టూరిజం ద్వారా కూడా దేశానికి ఆదాయం సమకూరుతోందని, విదేశీ మారకద్రవ్యం దేశానికి వచ్చి చేరుతోందన్నారు. అనంతరం నగరంలోని టాటా స్మారక కేంద్రం (టీఎంసీ)లో ఏర్పాటు చేస్తున్న నేషనల్ హాడ్రన్ బీమ్ ఫెసిలిటీ కేన్సర్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేన్సర్‌పై పోరాటానికి యూపీఏ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యాన్నిస్తోందని వివరించారు. కేన్సర్‌పై పోరాడేందుకు పరిశోధన కేంద్రాలను విస్తరిస్తున్నామని అన్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు జాతీయ కేన్సర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. రెండు వారాల్లో తాను శంకుస్థాపన చేసిన రెండో కేన్సర్ చికిత్స కేంద్రమని ఆయన పేర్కొన్నారు. వీటికోసం రూ.425 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. తద్వారా చికిత్స కేంద్రాలు గల దేశాల సరసన భారత్ నిలుస్తుందన్నారు. కేన్సర్‌తో బాధపడే మహిళలు, పిల్లల కోసం మరో భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని




