Wednesday, 4 November 2026

మూడోసారి బంగ్లా ప్రధానిగా షేక్‌హసీనా

ఢాకా, జనవరి 12 (జనంసాక్షి) :
బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా షేక్‌ హసీనా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. దేశాధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌ ఆదివారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. హసీనాతో పాటు 29 మంది కేబినెట్‌ మంత్రులు, మరో 19 మంది సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల దేశంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ అధికారాన్ని నిలబెట్టుకుంది. బంగ్లాదేశ్‌లో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ఆదేశ చరిత్రలోనే అత్యంత హింసాత్మకమైనవిగా పుటలకెక్కాయి. ఎన్నికలు జరిగిన జనవరి 5వ తేదిన జరిగిన మారణకాండకు 18 మంది మరణించగా 100కు పైగా పోలింగ్‌ కేంద్రాలకు విపక్షాలు మద్దతుదార్లు నిప్పు పెట్టారు.
బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లోని 300 స్థానాలకు గాను 147 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా నాయకత్వంలోని ప్రధాని ప్రతిపక్షం ‘బంగ్లాదేశ్‌ పార్టీ’ (బిఎన్‌పి) దాని 18 మిత్రపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించడంతో ప్రధానమంత్రి షేక్‌ హసీనా నాయకత్వంలోని అధికార అవామీ లీగ్‌, మరో 11 చిన్న పార్టీలకు చెందిన 153 మంది అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఫలితంగా దేశంలోని 100 మిలియన్ల మంది ఓటర్లు ఓటేసే అవకాశాన్ని కోల్పోయారు. దేశంలో స్వతంత్ర ఆపద్ధర్మ ప్రభుత్వ నాయకత్వంలో ఎన్నికలు జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేయగా అధికార పార్టీ అందుకు నిరాకరించింది. దాంతో ప్రతిపక్షాలు ఎన్నికల బహిష్కరణ బాట పట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *