Wednesday, 4 November 2026

మహారాష్ట్రలో… కోపాగ్నికి టోల్‌గేట్లు భుగ్గి

కోలాపూర్‌, జనవరి 12 (జనంసాక్షి) :
మహారాష్ట్రలో ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న టోల్‌గేట్లపై ప్రజలు ఆగ్రహావేశాల్ని ప్రదర్శించారు. ఆదివారం మూకుమ్మడిగా దాడి చేసి ఏకకాలంలో తొమ్మిది టోల్‌గేట్లను దహనం చేశారు. మహారాష్ట్రలోని కోలాపూర్‌లో అఖిలపక్షానికి చెందిన కార్యకర్తలు గత కొంతకాలంగా ప్రజల నుండి డబ్బు దండుకుంటున్న టోల్‌గేట్లను ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారు. శివసేనకు చెందిన పాటిల్‌ ఇతర కార్యకర్తలు గత ఆరో రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రత్యక్ష చర్యకు పూనుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన తొమ్మిది టోల్‌గేట్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించిన ప్రజలు టోల్‌గేట్లను అగ్నికి ఆహుతి చేశారు. కోపోద్రిక్తులైన ప్రజల ముందు పోలీసులు ఘటన స్థలంలో ఉన్నప్పటికీ నిలువరించలేకపోయారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రకు చెందిన మంత్రి హసన్‌ ముష్రీఫ్‌, హోం శాఖ మంత్రి హతీద్‌ పాటిల్‌ కోలాపూర్‌ మేయర్‌ ఇతర అధికారులతో హుటాహుటిని సమావేశం నిర్వహించి కాల్చి వేసిన టోల్‌గేట్లకు సంబంధించిన నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇకపై టోల్‌ వసూలు చేయరాదని కూడా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *