ప్రకాశంజిల్లా : ప్రకాశంజిల్లాలో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలిలో సునీత అనే మహిళపై ముసుగు ధరించిన యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో యువతి సజీవ దహనం అయ్యింది.నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




