హైదరాబాద్ : విజయవాడ ఇంద్రకీఆద్రిపై కొలువైన దుర్గమ్మ ఇవాళ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతునన విద్యార్ధుల కోసం దేవస్థానం అధికారులు ఇంద్రకీలాద్రిపై ఇవాళ ‘విజయీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్ధులకు ఉచితంగా అమ్మవారి దర్శనంతోపాటు కలం, లడ్డూ ప్రసాదం, అమ్మవారి ఫోటో, కంకణం అందజేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విద్యార్ధులు బారులు తీరారు. భవానీ దీక్షా మండపంలో మ హా సరస్వతీ యాగం నిర్వహించారు.




