Tuesday, 3 November 2026

వారంతా పిరికివాళ్లే : రఘువీరా

అనంతపురం, మార్చి 7 : కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారంతా పిరికివాళ్లేనని మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. రాష్ట్ర విభజనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన కారణమని ఆరోపించారు. సీమాంధ్రకు రాజధాని నగరంగా కర్నూలును చేయాలని కోరారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలతో చర్చించిన తరువాతే రాజధాని నగరంపై తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. విభజన నేపథ్యంలో పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *