Wednesday, 4 November 2026

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఓటింగ్‌ ప్రక్రియపై అవగాహన

ఏలూరు, మార్చి 15 : పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీటీసీ, యంపీటీసీలకు బ్యాలెట్‌ పత్రాల ద్వారానే ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతున్నందున గ్రామీణ ప్రాంతప్రజలను ఈ విషయంపై చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ ఆర్‌డిఓలను కోరారు. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం నలుగురుర ఆర్‌డిఓలతో స్థాణిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లుపై కలెక్టర్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో 46 జడ్పీటీసీలు, 903 యంపిటిసిలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాలెట్‌ ద్వారానే ఈ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను మరింత పటిష్టవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేవించారు. పోలింగ్‌కు 48గంటల ముందు మద్యంషాపులు మూసివేయించాలని అన్నారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని నిర్ణీత నమునాలో రోజువారీ సమర్పించేలా చూడాలని ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల్లోగా అభ్యర్థులు ఎన్నికల వ్యయం మొత్తం అకౌంట్‌ను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని అన్నారు.ప్రతి పోలింగ్‌ కేంద్రంలో రహస్య ఓటింగ్‌ విధానం అమలుచేయాలని  ఓటు వేసే క్యాబిన్‌లో ఓటరు తప్ప మరొకరిని అనుమతించకూడదని అన్నారు. ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని చెప్పారు. అభ్యర్థులకు వారి తాలూకు ఏజెంట్ల రక్షణకోసం నియమింపబడిన వ్యక్తులను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించకూడదని చెప్పారు. సమావేశంలో జడ్పీ సిఇఓ డి. వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *