Monday, 2 November 2026

టీ టీడీపీ గెలుపు గుర్రాలు

(జ‌నంసాక్షి)  :
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణలో టీడీపీ తరపున పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంగళవారం అర్థరాత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండో జాబితాలో 44 ఎమ్మెల్యే, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా తెలంగాణలో టీడీపీకి 9 పార్లమెంటు స్థానాలు దక్కాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి స్థానంలో శరత్ కుమార్, అందరు ఎదురు చూస్తున్న మల్కాజ్ గిరి స్థానంలో మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత జె.మల్లారెడ్డిని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల స్థానానికి వీరేందర్ గౌడ్ పేరు ఖరారు కాగా… నాగర్ కర్నూలు లోక్ సభకు బక్కాని నర్సింహులు, నల్గొండ స్థానంలో చిన్నప్ప రెడ్డి, ఖమ్మం స్థానానికి నామా నాగేశ్వరరావు పేర్లను ప్రకటించారు.

తెలంగాణలో 44 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ అసెంబ్లీ స్థానంలో రావి శ్రీనివాస్, బెల్లంపల్లి  అసెంబ్లీ స్థానంలో డాక్టర్ పాటి సుభద్ర, ఆసిఫాబాద్ లో సరస్వతి, ఖానాపూర్ లో రితేష్ రాథోడ్, బోధ్ లో సోయం బాపురావు, నిర్మల్ లో మీర్జా యాసిన్ బేగ్ .. టీడీపీ తరఫున బరిలో దిగనున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ స్థానంలో రాజరామ్ యాదవ్, జుక్కల్ లోమద్దెల నవీన్ పేర్లను ప్రకటించగా.. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ స్థానంలో మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ లో ముద్దసాని కశ్యప్ రెడ్డిల పేర్లను వెల్లడించారు. మెదక్ అసెంబ్లీ స్థానాన్ని జగపతికి కేటాయించగా…పటాన్ చెరు నియోజకవర్గంలో ఎం.సఫన్ దేవ్ నుటీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ లో తోటకూర జంగయ్య యాదవ్, కుత్బుల్లాపూర్ లో కె.పి.వివేక్ గౌడ్, ఎల్బీనగర్ లో ఆర్. కృష్ణయ్య, శేరిరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, చేవెళ్ల లో మేకల వెంకటేష్  పేర్లను అధినేత ప్రకటించారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో మాగంటి గోపీనాథ్, నాంపల్లిలో  ఫిరోజ్ ఖాన్, చార్మినార్ స్థానంలో ఎం.ఎ.బాసిత్, బహదూర్ పురాలో అబ్దుల్ రెహమాన్ సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానంలో కూన వెంకటేష్ గౌడ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో జి. సాయన్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయనున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కొండగల్ లో రేవంత్ రెడ్డి, నారాయణ్ పేట్ లో రాజేందర్ రెడ్డి, జడ్చర్లలో ఎం. చంద్రశేఖర్, దేవరకద్రలో కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి, మక్తల్ లో కొత్తకోట దయాకర్ రెడ్డి, వనపర్తిలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అలంపూర్ లో వీఎం అబ్రహాం పోటీ పడనున్నారు.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ స్థానం అంజయ్య యాదవ్ కు, కోదాడ సీటు బొల్లం మల్లయ్య యాదవ్ కు తుంగతుర్తి స్థానాన్ని పాల్వాయి రజనీకుమారికి కేటాయించారు.

వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్, స్టేషన్ ఘన్ పూర్ స్థానంలో దొమ్మాటి సాంబయ్య, డోర్నకల్ లో డాక్టర్  రామచంద్రనాయక్ బరిలో దిగనున్నారు.

ఖమ్మం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. హరిప్రియ నాయక్ ఇల్లెందు తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, స్వర్ణకుమారికి పాలేరు, మోత్కుపల్లికి మధిర, బానోతు బాలాజీకి వైరా, సంగడ్ర వెంకటవీరయ్యకు సత్తుపల్లి, మాచి నాగేశ్వరరావుకు అశ్వారావుపేట, ఫణీశ్వరమ్మకు భద్రాచలం స్థానాలు కేటాయించారు.

తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ టిక్కెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చందరరావు, వూకే అబ్బయ్యలకు తగు న్యాయం చేస్తామని అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే శాసన మండలిలో ఇద్దరికీ ప్రధమ ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోదాడ టిక్కెట్ కోసం ఉమామాదవ రెడ్డి చివరి వరకు పోరాడినా కొన్ని కారణాల మెత్కుపల్లి సపోర్ట్ చేసిన గొల్లం మల్లయ్య యాదవ్ కే చోటు దక్కింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *