గుంటూరు(జనంసాక్షి):గుంటూరు జిల్లా పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లిలో దారుణం జరిగింది. ఆదిలాబాద్ నుంచి గురజాల వైపు వెళ్తున్న లారిని…ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.




