Tuesday, 3 November 2026

నేను చాయ్ అమ్మాను కానీ …

 

 

(జనంసాక్షి) : నేను చాయ్ అమ్మాను.. కానీ దేశాన్ని అమ్మలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి. పేదవాడి ఆకలికేకలు యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి. జరుగుతున్న ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ను సాగనంపి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే మోసగాళ్ల ఆటలు కట్టించి పేదలకు మేలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *