హైదరాబాద్ (జనంసాక్షి) : శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తన స్వంత గ్రామం నీలకంఠాపురంలో తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎడ్లబండిపై పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన రఘువీరా రెడ్డి కాంగ్రెసు పార్టీకి ఓటు వేసినట్లు చెప్పారు.
Related