Tuesday, 3 November 2026

గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

గుంటూరు (జ‌నంసాక్షి  ): గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో టీడీపీ ఏజెంట్లను వైసీపీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రంపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ- వైసీపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. మరోక ఘటనలో నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం తల్లంపాడు వద్ద కూడా వైసీపీ- టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు వ్యక్తులు గాయాలపాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *