
రాజంపేట, మే 7 : చిత్తూరుజిల్లా, రాజంపేట భారతీయ జనతాపార్టీ లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పుంగనూరు నియోజకవర్గం సదుం పోలింగ్ కేంద్రంలో వైసీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి, పెద్ది రెడ్డి కొడుకు మిథున్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. పుంగనూరు రాజంపేట ఎంపీ సెగ్మింట్ కిందకు వస్తుంది. పుంగనూరులో వైసీపీ పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడింది.
అదే సమయంలో పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన పురంధేశ్వరి రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. పోలింగ్ పూర్తి అయ్యేవరకు అక్కడే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఏజెంట్లను బలవంగంగా బయటకు నెట్టేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




