విజయవాడ, (గవర్నర్‌పేట), మే 23 : కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. విజయవాడలోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో వర్సిటీ ఉపాధ్యక్షులు కోనేరు రాజా హరీన్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 36,480 మంది విద్యార్థులు హాజరయ్యారని, అందులో 16,745 మంది కౌన్సె లింగ్‌కు అర్హత సాధించినట్లు చెప్పారు. కౌన్సెలింగ్ జూన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్షలో ఒకటి నుంచి 10వ ర్యాంకు సాధించిన విద్యార్థులతోపాటు ఎంసెట్‌లో ఒకటి నుంచి 200, జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో ఒకటి నుంచి 3 వేల ర్యాంకులోపు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఒకటి నుంచి 5 వేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజులో 100 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కూడా 100 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు




