ఏలూరు : కట్టుకున్న భార్య, అత్తలపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పించాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలోని వంగాయగూడెం మహేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. మహేశ్వర కాలనీలో నివాసముంటున్న శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కుటుంబ తగాదాల కారణంతో భార్య, అత్తలపై కిరోసిన్ పోసి నిప్పంటిచాడు. అనంతరం తానూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈఫ్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీమన్నారాయణ భార్య లక్ష్మి, అత్త సత్తెమ్మలను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మరణించారు. శ్రీమన్నారాయణ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.