Tuesday, 24 November 2026

Main

నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ…

నల్గొండ: జిల్లాలోని సాయిదుర్గ చిట్ ఫండ్ లో భారీ దోపిడీ జరిగింది. చిట్ ఫండ్ లోని రూ.20 లక్షల రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. యజమానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్డీఓ, డిప్యూటి డైరక్టర్, ఆర్ఐ లపై వేటు..

నల్గొండ : యాదగిరిగుట్టలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఆర్డీఓ సోములు నాయక్, డిప్యూటి డైరెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐ నాగరాజ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. గుట్ట పరిధిలోని ఆరు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ లను నిలిపివేస్తూ…

కెనరా బ్యాంకు సిబ్బంది దాష్టీకం..

5నల్గొండ : తుంగతుర్తిలోని కెనరా బ్యాంకు సిబ్బంది ఓ కస్టమర్ పై దాడి చేశారు. జీరో అకౌంట్ సమాచారం అడిగినందుకు దాడి చేశారు. బ్యాంకు నుండి వెళ్లిన తరువాత కూడా బ్యాంకు సిబ్బంది వెంబడించి ఆ కస్టమర్ పై…

చందుపట్ల చెరువు అభివృద్ధికి కోటిన్నర: కేసీఆర్

 నల్గొండ : జిల్లాలోని చందుపట్ల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే నకిరేకల్‌ నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లలో శనివారం సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు.…

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

నల్గొండ : జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో పెద్ద చెరువు పునరుద్దరణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్,…

మిర్యాలగూడలో ఆందోళన చేపట్టిన రైతులు

నల్గొండ: అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన తమ పంటలను అధికారులు పరిశీలించడం లేదని మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే నష్టపోయిన తమ పంటలను పరిశీలించి పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.…

ముగిసిన నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ:అధికారిక లాంఛనాలతో మార్క్సిస్టు యోధుడు నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, జానారెడ్డి, ఎంపి గుత్తాసుఖేందర్ రెడ్డి, చుక్కా రామయ్య తదితర వామపక్ష…