Tuesday, 24 November 2026

Main

నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం.. నకిరేకల్ తరలింపు…

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కార్యాలయం నుంచి నకిరేకల్ కు తరలిస్తున్నారు. అంతిమయాత్రలో సీపీఎం పొలిట్ బ్యూరో బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. తమ్మినేని వీరభద్రంలు…

నకిరేకల్ కు చేరుకున్న నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవరెడ్డి భౌతికకాయం నకిరేకల్ కు చేరుకుంది. ఆయన అభిమానుల సందర్శనార్థం గంటల పాటు నకిరేకల్ సీపీఎం పార్టీ ఆఫీసులో రాఘవరెడ్డి భౌతికాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పట్టిమర్తిలో రాఘవరెడ్డి అంత్యక్రియలు…

ఉగ్రవాదుల శవాలు జనగామకు తరలింపు

నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన ఐదుగురు ఉగ్రవాదుల శవాలను వరంగల్ జిల్లా జనగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శవాలకు కాసేపట్లో పోస్టుమార్టం చేయనున్నట్టు జనగామ డీఎస్పీ నరేందర్ తెలిపారు.

నల్గొండ జిల్లా ఆలేరులో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు ఉగ్రవాదులు హతం భువనగిరి, ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు – వరంగల్‌ జిల్లా పెంబర్తి మధ్య జాతీయ రహదారిపై ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు మృతి చెందారు. వికారుద్దీన్‌ ముఠాను ఉదయం…

నల్గొండ ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్..

నల్గొండ : జిల్లా ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు స్వీకరించారు.

యాద్రాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

నల్లగొండ : యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహ్మా స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గుట్టపైకి వాహనాలను పోలీసులు…

గ్యాస్‌లీకై ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమామ్ పేట సమీపంలోని హెచ్ పీసీఎస్ దగ్గర గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరం-బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్:ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. దుండగుల ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తీవ్రంగా గాయపడిన సీఐ, ఎస్సైలకు మెరుగైన శస్త్ర చికిత్స అందించాలని వైద్యులకు సూచించామన్నారు.

పోలీసులకు ప్రాణాపాయం లేదు:కామినేని వైద్యులు…

నల్లగొండ: జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్సై సిద్ధయ్యకు మెదడు భాగంలో, ఛాతిలో బుల్లెట్లు తగిలాయని ఆయన పరిస్థితి ప్రస్తుతం…