Sunday, 15 November 2026

నల్లగొండ

పేలిన డైనమేట్ :ఒకరి మృతి

నల్గొండ:చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గుట్టపై డైనమేట్‌ బాంబ్‌ పేలి ఒకరు మృతి చెందారు. గుట్టలోని బండరాళ్లను పగలకొట్టేందుకు అమర్చిన డైనమేట్ వల్లనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భువనగిరిలో అగ్ని ప్రమాదం

 భువనగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గంజి మార్కెట్ సమీపంలోని శ్రీ సోమేశ్వర స్వామి పెయింటింగ్ షాపు పూర్తిగా కాలిపోయింది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం…

ఏసీబీ వలలో సస్పెండ్ అయిన తహసీల్దార్

నల్గొండ:లంచం తీసుకుంటూ సస్పెండైన యాదగిరిగుట్ట తహశీల్దార్ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. ఓ రైతు వద్ద నుంచి రూ. 15 వేలను లంచంగా తీసుకుంటూ తహశీల్దార్ సోమ్లానాయక్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు…

నల్గొండలో సీపీఐ కార్యకర్త దారుణ హత్య

నల్లగొండ: సీపీఐ కార్యకర్త యాదయ్య ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాదయ్యను గొడ్డలితో నరికారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

తండ్రిని చంపిన కొడుకు…

నల్గొండ:మర్రిగూడ మండలం అంతంపేటలో తాగిన మైకంలో కొడుకు తండ్రిని హతమార్చాడు. తండ్రిని చంపిన కొడుకు నిర్వాకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు:ఒకరి మృతి

నల్లగొండ: సూర్యాపేటలో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో 10 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి విశాఖపట్టణంకు చెందిన కందుకూరి అవినాష్‌గా గుర్తించారు. వైజాగ్‌ నుంచి ఆరెంజ్‌…

ఆస్పత్రిలో కోలుకుని.. విధుల్లో చేరిన సూర్యాపేట సీఐ మొగిలయ్య

నల్గొండ: గత నెల ఏప్రిల్‌ 1వ తేదీన నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సూర్యాపేట పట్టణ సీఐ మొగిలయ్య కొలుకుని, తిరిగి విధుల్లో చేరారు. ఆ.. రోజు జరిగిన ఘటనను ఆయన బ్యాడ్‌…

సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యం: కేసీఆర్‌

 నల్గొండ: సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతుల్లో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. డబ్బు సంపాదించాలనుకుంటే.. పేడ కూడా అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చన్నారు. కానీ, ఉన్నతంగా బతికితేనే…

కేసీఆర్ ఏరియల్ సర్వే 

నల్లగొండ: జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఏరియల్ సర్వేలో మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.