Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

సడక్‌బంద్‌కు మద్దతుగా రాస్తారోకో

గద్వాల సడక్‌బంద్‌కు మద్దతుగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపైన సీపీఐ న్యూడెమోక్రసీ, పీడీఎన్‌యూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు  తరలించారు.

పలువురి నేతలు అరెస్టు

షాద్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెరాస, భాజపా, సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెరాస ఎమ్మెల్యే, ఎమ్మెల్యీ నారదాసు లక్ష్మణరావు, పరిగి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌, బీజేపీ శాసనసభాపక్షనేత లక్ష్మీనారాయణ. వరంగల్‌…

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అరెస్టు

మహబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను గురువారం జిల్లా పోలీసులు మహ్మదాబాద్‌ వద్ద అరెస్టు చేశారు.అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో

అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఆలంపూర్‌లో తెరాస ఎమ్మెల్యేల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ టోల్‌ప్లాజావద్ద రహదారి దిగ్బంధానికి యత్నించిన తెరస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి. జితేందర్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కొత్తకోట మండలం పాలెంలో సడక్‌బంద్‌కు వెళ్తున్న పాలమూరు వర్శిటీ విద్యార్థులను…

సీపీఐ నాయకుల అరెస్టు

ఆలంపూర్‌: సడక్‌ బంద్‌లో భాగంగా ఆలంపూర్‌లో రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలంపూర్‌ చౌరస్తాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

తాగునీటి ఎద్దడి నివరణకు గ్రామస్థుల ఆందోళన

చిన్నచింతకుంట: మండలంలోని ఉండ్యాల గ్రామంలో తాగునీటి ఎద్దటి నివారించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోలకు అంతరాయం కలిగించారు. సమస్య తీవ్రత చాలా రోజులగా ఉన్నా అధికారులు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సడక్‌బంద్‌ను అనుమతించని జిల్లా ఎస్పీ

మహబూబ్‌నగర్‌ : ఈ నెల 21న ఐకాస నిర్వహిస్తున్న సడక్‌బంద్‌కు అనుమతి లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 22 ఉదయం వరకూ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని ఆయన…