Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

లారీ,బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ వద్ద లారీ, బైక్‌ ఢీ కొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సిఉంది.

ఉపాధ్యాయురాలి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : న్యూటౌన్‌ వెంకటేశ్వరనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జులేఖా బేగం దారుణ హత్య కు గురైంది. జులేఖా ముఖం, కళ్లల్లో యాసిడ్‌ పోసి దుండుగులు హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. కోనపాల మూరు…

కన్న తల్లిని నరికి చంపిన కొడుకు

మహబూబ్‌నగర్‌: మల్దకల్‌ మండలం మాదలబండ పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్నతల్లిని గొడ్డలితో దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కురుమూర్తి దేవస్థాన హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1లక్ష 36 వేల 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్‌ మూర్తి తెలిపారు.

రాస్తారోకో చేస్తున్న 50 మంది అరెస్టు

పెబ్బేరు: సడక్‌ బంద్‌లో భాగంగా 44వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్న 50 మంది భాజపా కార్యకర్తలను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పెబ్బేరు జాతీయ రహదారిపై…

టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు

భూత్పూర్‌: అడ్డాకుల మండలం జానంపేట, కాటవరం గ్రామాల్లో జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారి పరిశీలనకు వచ్చిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ తన సిబ్బందితో నిప్పంటించిన టైర్లను తొలగింపచేశారు.

జాతీయ రహదారిని పరిశీలించిన డీఐజీ నాగిరెడ్డి

భూత్‌పూర్‌: భూత్‌పూర్‌, అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆందోళన కారులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసుకున్న డీఐజీ నాగిరెడ్డి జాతీయ రహదారిని పరిశీలించారు.

700 మందిని అదుపులోకి తీసుకున్నాం.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని సాయంత్రానికి వదిలేస్తామని పేర్కోన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా…

భూత్‌పూర్‌లో సడక్‌బంద్‌

భూత్‌పూర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మండలంలోని తెరాస నాయకులు పెద్ద యెత్తున రాస్తారోకో చేపట్టారు. డీఎస్పీ మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో పది నిమిషాలు పాటు నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు.…

అడ్డాకులలో ఐకాస ఆందోళన

అడ్డాకుల: సడక్‌బంద్‌లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాటవరంవద్ద జాతీయరదారిపై రోడ్డుపై టైర్లకు మంట పెట్టారు. అదేసమయంలో…