Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

4న టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

మహబూబ్‌నగర్‌: త్వరలో విశాఖపట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ టెన్నికాయిట్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఈనెల 4న స్టేడియం మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి వడెన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి…

5న జిల్లాస్థాయి నృత్యపోటీలు

మహబూబ్‌నగర్‌: ఈనెల 5న జిల్లాస్థాయిలో భరతనాట్యం, కూచిపూడి, జానపదనృత్య పోటీలు జిల్లా కేందం మున్సిపల్‌ టౌనుహాల్‌లో నిర్వహించనున్నట్లు చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మెట్టుకాడి శ్యాంసుందర్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సాంప్రదాయ కళల పరిరక్షణకు ఈ పోటీలు…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయరహదారిపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఆగివున్న లారీని ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులుంతా కడప జిల్లాకు చెందిన వారిగా…

చికెన్‌గున్యా జ్వరంతో గ్రామస్థుల అవస్థలు

బాలానగర్‌: బాలనగర్‌ మండలం మోతి ఘనపూర్‌ గ్రామంలో 40 మందికి పైగా చికెన్‌గున్యా జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఇంటింటా ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడ్తున్న…

కుటుంబసభ్యుల దాడిలో వ్యక్తి మృతి

వనపర్తి : మండలపరిధిలోని శ్రీనివాసపూర్‌ పంచాయతీ పరిధీలోని బుడగంజంగాల కాలనీలో బాలరాజు అనే వ్యక్తి మంగళవారం రాత్రి కుటుంబసభ్యుల దాడిలో మృతి చెందాడు. బాలరాజు కుటుంబసభ్యులతో తరచు గొడవపడేవారు. మంగళవారం వదిన పద్మ కూలిపని చేస్తుండగా వెళ్లి కొట్డాడు.…

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

ఐజ : మండల కేంద్రంలోని ఐజలోని దళితవాడలొ మంగళవారం అర్థరాత్రి నాగరాజు తన భార్య జయమ్మ(30) పై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా గొడవలు చోటు చేసుకోవటం తో అర్థరాత్రి…

ఇరువర్గాల మధ్య ఘర్షణ: 14మందికి తీవ్రగాయాలు

ఇటిక్యాల: ఇటిక్యాల మండల శివారు బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకన్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని గద్వాల ఆసుపత్రికి తరలించారు.…

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పుల్లగిరి గ్రామ సమీపంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కుందెళ్ల వేటకు వెళ్లిన గోవింద్‌, హల్యా గోవింద్‌ అనే ముగ్గురు విద్యుదాఘాతానికి గురాయ్యరు. ఈ ప్రమాదంలో గోవింద్‌ మృతి చెందాడు.…

మహిళను చితకబాదిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్లవైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ వెళ్తున్న ఇంద్ర బస్సు వెనకనుంచి ఢికొంది. ఈ దుర్ఘటనలో అమ్మమ్మ, మనవడు అక్కడికక్కడే మృతిచెందారు. బండి నడుపుతున్న వ్యక్తి మాత్రం…