Thursday, 5 November 2026

మెదక్

17,18 తేదీల్లో సీఆర్పీలకు శిక్షణ

సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యా హక్కు చట్టం అమలు, పాఠశాలల సందర్శన సమాచార సేకరణపై సీఆర్పీలకు ఈ నెల 18, 19 తేదీల్లో శిక్షణ సమావేశాలు నిర్వహింస్తున్నట్లు ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. 17న మెదక్‌, సంగారెడ్డి డివిజన్‌ సీఆర్పీలకు…

చిన్నారి చూపుపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: చిన్నారి చూపు కార్యక్రమంపై బుధవారం ఉదయం 10.30కు వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. బడిబయటి పిల్లల ఆన్‌లైన్‌ నమోదు, వివరాల తనిఖీపై మార్గదర్శకాలను వివరిస్తారని తెలిపారు.

170 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టివేత

మెదక్‌ : కంది వద్ద అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని విజెలిన్స్‌ అధికారులు పట్టుకున్నారు. లారీల్లో బియ్యాన్ని ముంబయికి తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నాట్లు తెలిపారు. బియ్యాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.

కుటుంబకలహాలతో అన్న, తమ్ముడు ఆత్మహత్య

మిరుదొడ్డి: మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్‌లోని ఓ కుటుంబంలో అన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దుబాయ్‌లో దుబ్బాక వాసి మృతి

దుబ్బాక : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మెదక్‌ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన పెంటయ్య అక్కడి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందాడు. పెంటయ్య ఆరేళ్ల కిందట గల్ఫ్‌ వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లభించలేదు. పర్యాటక…

కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

మెదక్‌ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం అనాజ్‌పూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం కర్రెల పోచయ్య (18) అనే డీగ్రీ విద్యార్థి గ్రామంలో జరుగుతున్న పెండ్లికి హాజరయ్యాడు. పెండ్లి పనుల్లో…

సంగారెడ్డిలో న్యాయవాదులపై లాఠీఛార్జీ

మెదక్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ చలో సంగారెడ్డి’ ధర్నాను పోలీసులు హింసాత్మకంగా మార్చురు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ విద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి కోర్టు…

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద శాంతిమందిరం

సందేశానికి ముస్తాబు మెదక్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): మెదక్‌ కెథడ్రల్‌ చర్చి… వాటికన్‌ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లో జగతికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి మందిరమే కాదు.. ప్రశాంతతకు నిలయమైన మహాదేవాలయం,…

లారీ-డీసీఎం ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద లారీ డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం చెరువురాపల్లి తండాలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జ్యోతి (28) అనే వివాహిత తనతో పాటు బిడ్డలు అనిల్‌ (4),…