Thursday, 5 November 2026

మెదక్

సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపు

మెదక్‌ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అరెస్టుకు నిరసనగా ఇవాళ, రేపు సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపునిచ్చింది. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో దుకాణాలను ఎంఐఎం కార్యకర్తలు మూసివూయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా…

సంగారెడ్డి కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్‌

మెదక్‌ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇవాళ సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 2005లో అప్పటి కలెక్టర్‌ అనీల్‌కుమార్‌ను దూషించిన కేసులో ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అసదుద్దీన్‌ తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మెదక్‌ జిల్లా కోర్టుకు హాజరైన అసదుద్దీన్‌

సంగారెడ్డి : కలెక్టర్‌, జేఏసీలను దూషించిన కేసులో హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ మెదక్‌ జిల్లా కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. పటాన్‌చెరువు మండలం ముత్తంగిలో 2005 ఏప్రీల్‌ 16న మసీదు ఆవారా గోడ విషయంపై…

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటించాలి

మెదక్‌, జనవరి 19 హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటించాలని డిమాండ్‌తో శనివారంనాడు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బైక్‌ ర్యాలీ రాందాస్‌ చైరాస్తా మీదుగా పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ జై తెలంగాణ, జైజై…

అహ్మద్‌పాషా ఖాద్రిని అరెస్టు చేయాలి

కమాలానందభారతిని విడుదల చేయాలి సంగారెడ్డి, జనవరి 19 : జాతిపిత మహ్మతాగాంధీని అవమానపరిచి దేశద్రోహానికి పాల్పడిన అహ్మద్‌పాషా ఖాద్రిని చట్టపరంగా శిక్షించాలని, కమలానందభారతిని బేషరత్తుగా విడుదల చేయాలని విశ్వహిందుపరిషత్‌, హనుమాన్‌భక్తబృందం, వాసవీక్లబ్‌లకు చెందిన వారు బైక్‌ర్యాలీ నిర్వహించారు. స్థానిక…

ఆధార్‌కార్డు కోసం ఇబ్బందులకు గురవుతున్న జనం

సంగారెడ్డి, జనవరి 19 : మెదక్‌ పట్టణంలో ఆధార్‌కేంద్రం వద్ద ఆధార్‌కార్డు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఆధార్‌ కేంద్రం వద్ద దరఖాస్తు ఫారాలు ఇవ్వాల్సి ఉండగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆధార్‌ దరఖాస్తు…

కోర్టులో హజరైన జగ్గారెడ్డి

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కందిలో వాహనాల దహనం కేసులో ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డి కోర్టులో హాజరయ్యారు. ఎక్సైజ్‌ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట ఆయన హజరయ్యారు. కేసు ఏప్రిల్‌ 2కు వాయిదా పడింది.

బయట నుంచి గొళ్లెం పెట్టి గుడిసెకు నిప్పు

త్రుటిలో ప్రాణాలు దక్కించుకొన్న బాధితులు జిన్నారం: బయట నుంచి గొళ్లెం పెట్టి గుడిసెకు నిప్పంటించిన దారుణ సంఘటన జిన్నారంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.…

రోడ్డుప్రమాదంలో బాలుడి మృతి

గజ్వేల్‌టౌన్‌:పండుగ సంబరాలనుఆస్వాదించే సమయంలో రోడ్డు ప్రమాదం తల్లిదండ్రులకుపుత్రశోకాన్ని మిగిల్చింది. పేడ తీసుకొస్తానమ్మా అంటూ ఇంటి నుంచి వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఈ విషాదకర సంఘటన సోమవారం ఉదయం పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ వద్ద…

రైతు ఆత్మహత్య

తొగుట: కడుపు నొప్పి భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండలం కాన్గల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతరాజు భూమయ్య తరచూ కడుపునొప్పితో బాధపడు తున్నాడు. ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి…