Saturday, 28 November 2026

హైదరాబాద్

అవినీతి మంత్రులు తక్షణం రాజీనామా చేయాలి: దత్తాత్రేయ

విశాఖ:  అవినీతి మంత్రులు తక్షణమే రాజీనామా చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి సైతం అవినీతి మంత్రులను తొలగించకపోవడం శోచనీయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పక్కా ప్రణాళికతో ప్రచార…

తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈరోజు టీఎన్టీవో భవన్‌లో సమావేశమైంది. ఛలో అసెంబ్లీ , బయ్యారం బస్సు యాత్ర తేదీలు, నిర్వహణ తదితర అంశాలపై ఈభేటీలో చర్చించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 27,050, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 25,900, వెండి కిలో 44,400.

విజయవాడలో అన్నమయ్య జయంత్యుత్సవాలు

విజయవాడ : పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య 605 జయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తితిదే కల్యాణ మండపం నుంచి లబ్బీపేట వెంకటేశ్వరస్వామి అలయం వరకు ఆయన విగ్రహాన్ని వూరేగింపుగా తీసుకెళ్లారు. అన్నమాచార్యుల సంకీర్తనలకు చిన్నారులు సంప్రదాయబద్ధంగా…

వచ్చే ఎన్నికల్లో భాజపాదే విజయం: దత్తాత్రేయ

విశాఖ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం తప్పక విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా నగరానికి విచ్చేసిన ఆయన…

చిన్నారుల మరణాలపై సీఎం ఆరా

హైదరాబాద్‌ : నీలోఫర్‌ సహా వివిధ ఆస్పత్రుల్లో పెరిగిన చిన్నారుల మరణాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అరా తీశారు. వీటిపై దిద్దుబాటు చర్చలను తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ కార్యదర్శి అజయ్‌ సహానీకి ముఖ్యమంత్రి అదేశాలు జారీ చేశారు. నీలోఫర్‌ సహా…

రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఈరోజు 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు నిజామాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడదెబ్బకు 13 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడదెబ్బకు ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు ఉదయమే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, విశాఖ, కడప , వరంగల్‌…

శ్రీశైలం ఆలయ సూపరిటెండెంట్‌ సస్పెన్షన్‌

శ్రీశైలం : శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయం సూపరిటెండెంట్‌ రాధాకృష్ణపై ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ సస్పెన్షస్‌ వేటు వేశారు. రోజూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న కారణంగా ఆయనను సస్పెన్షస్‌ చేసినట్లు ఈవో తెలిపారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడ్డాయి.