Saturday, 28 November 2026

హైదరాబాద్

గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై చర్యలు

విశాఖ : సింహాచలం గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ గోపీనాథ్‌ను ఈవో రామచంద్రమోహన్‌ సస్పెండ్‌ చేశారు. గోశాల నుంచి ఈ ఉదయం 12 కోడె దూడలను అక్రమంగా తరలిస్తుండగా తరలిస్తుండగా…

బాబ్లీపై నేడు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : బాబ్లీపై సచివాలయంలో ఈ ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న  ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.

సబితతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : సబితాఇంద్రారెడ్డితో మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి , వట్టి వసంత కుమార్‌ ఈ ఉదయం సమావేశమయ్యారు. రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన

హైదరాబాద్‌ : ధర్మాన ప్రసాదరావును మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్‌ ఈ ఉదయం కలిశారు. తనను బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయం శిరసావహించి పార్టీకి సేవచేస్తానని ఆయన…

నేటి నుంచి అప్పన్న చందనం విక్రయాలు

విశాఖ: సింహాద్రి అప్పన్న చందనం విక్రయాలను ఈ ఉదయం ప్రారంభించారు. స్వామివారి చందనం కోసం భక్తులు బారులు తీరారు. రోజుకు 500 ప్యాకెట్లను విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పలువురు భక్తులు చందనం అందక వెనుతిరిగిపోయారు.

మిట్టకూరపల్లెలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా : బైరెడ్డిపాలెం మండలం మిట్టకూరపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరి, బీన్స్‌, రాగి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరిమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

ఓయు జెఎసి గాంధీభవన్‌ ముట్టడి

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఎయు జెఎసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌ ముట్టడించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆలయం వద్ద లారీఢికొని భక్తురాలి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: మాక్లూరు మండలం వడియాట్‌పల్లిలోని వడియాటమ్మ ఆలయం వద్ద లారీ ఢికొని ఒక భక్తురాలు మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వెనక్కి వెళ్లి లక్ష్మీబాయి అనే భక్తురాలని ఢికొట్టింది. ఆమె అక్కడికక్కడే దుర్మురణం…

హైదరాబాద్‌ బయలుదేరిన విజయమ్మ

కరీంనగర్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సరిసిల్ల పర్యటన ముగిసింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె హైదరాబాద్‌ బయలుదేరారు.

విద్యార్థినిపై అశ్లీల వెబ్‌సైట్‌ : విద్యార్థి అరెస్ట్‌

చీరాల, జనంసాక్షి: ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై ఓ విద్యార్ధి అశ్లీల వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశాడు. ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు విద్యార్థి అత్తులూరి  సంతోష్‌ను వేటపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేయడానికి ప్రధాన సూత్రధారి హారిక…