Saturday, 21 November 2026

హైదరాబాద్

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

అత్యధికంగా కడపలో 41 డిగ్రీలు నమోదు హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా…

రేప్‌ కేసులో నిందితుడికి ఏడేళ్ల శిక్ష

డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌) : మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కాషియాపూర్‌ స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొరదాబాద్‌ కు చెందిన మనీష్‌ షైని గతేడాది అక్టోబర్‌ లో పాఠశాల నుంచి మైనర్‌ బాలికను అపహరించి…

రాజకీయ లబ్ధి కోసమే విపక్షాల ఆందోళనలు : బొత్స

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కోరారు. గాంధీభవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రజలపై విద్యుత్‌ భారం పడకుండా చూడాలని ప్రభుత్వం ముఖ్యమంత్రిని పార్టీ తరపున…

సెట్‌టాప్‌ బాక్సుల గడువును మరో నెల పెంచాలి

కేంద్రానికి సీఎం లేఖ హైదరాబాద్‌ : రాష్ట్రంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా సెట్‌టాప్‌ బాక్సులు పెట్టుకునేందుకు మరో నెల గడుపు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌, విశాఖలో అనలాగ్‌ సిగ్నల్స్‌ నేటి అర్థరాత్రి…

మహిళల ఆందోళనలు

ఒంగోలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డుపై మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కొళాయిల్లో మురికినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళతో రహదారిపై…

టిబెట్‌లో కొనసాగుతున్న గాలింపుచర్యలు

లాసా : టిబెట్‌లో కొండచరియ విరిగిపడటంతో గల్లంతైన 83 మంది కార్మికుల అచూకీ కనుగొనేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. బండారుగని కార్మికులపై కొండచరియ విరిగి పడటంతో 83 మంది కార్మికులు మట్టికింద కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రెండురోజులు…

ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు

ప్యారిస్‌(ఫ్రాన్స్‌) : ప్రపంచ ప్రసిద్ధ కట్టడమైన ఈఫిల్‌ టవర్‌ను బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అక్కడ వున్న దాదాపు 1400 మంది పర్యాటకులను టవర్‌నుంచి తరలించారు. అనంతరం పోలీసు జాగిలాలతో పాటు బాంబు నిర్వీర్య దళాలు టవర్‌ను నిశితంగా…

200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ : ముంచంగిపుట్టలోని కిలగాడ జంక్షన్‌ వద్ద 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

అక్టోబర్‌లో ఎన్నికలకు అవకాశం

హైదరాబాద్‌ : యూపీఏ ప్రభుత్వ ఎక్కువకాలం కొనసాగదని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలో బీజేపీకి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయాన్నారు.

పెళ్లి కోసం దాచిన రూ. 2.20 లక్షల నగదు దగ్ధం

గుంటూరు : వేమూరు మండలం అబ్బెనగూడపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రెండిళ్లతోపాటు 10 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపకసిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో తన మనవరాలి పెళ్లి కోసం దాచిన రూ…