Friday, 20 November 2026

హైదరాబాద్

పిల్లలను విక్రయించిన ఇద్దరు అరెస్ట్‌

విశాఖపట్నం : తగరపువలసలో పిల్లలను విక్రయించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారు తగరపువలసలో ఇద్దరు చిన్నారులను విక్రయించడానికి ప్రయత్నించారు.

సల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు, వ్యక్తి అరెస్ట్‌

విశాఖపట్టణం : సెల్‌ఫోన్‌లో మహిళల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించిన యల్లా శ్రీనివాస్‌ అనే వ్యక్తిని భీమిలి పోలిసులు అరెస్ట్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే : యడ్యూరప్ప

బెంగళూరు : తన తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ పార్టీ నేత యడ్యూరప్ప తెలిపారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడమే తమ ముందున్న ధ్యేయమన్నారు. తన మొదటి లక్ష్మం నెరవేరిందన్నారు.…

మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య

అల్వాల్‌: తల్లి మందలించినందుకు మనస్తాపనకు గురైన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఏడో తరగతి చదువుతున్న సాయికుమారి (14) ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటుదని తల్లి తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు…

నిర్భయ్‌ క్షిపణి పరీక్ష విఫలం

న్యూఢిల్లీ : భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యం మార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నార్భయ్‌ మిస్సైల్‌ను రూపొందించిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ – డీఆర్‌డీవో…

హోంమంత్రిని కలిసిన సూరారం వీకర్స్‌ సెక్షన్‌ వాసులు

శ్రీనగర్‌ కాలనీ: గత 16ఏళ్ల పైన తాము ఉంటున్న నివాసాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ సూరారం కాలనీ వాసులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతి పత్రం అందించారు. సమస్యను…

ఉగాది నుంచి హెల్త్‌ కార్డుల పథకాలు ప్రారంభం

మంత్రి కొండ్రు మురళి ప్రకటన హైదరాబాద్‌ : రాష్ట్ర్ణప్రభుత్వ ఉద్యోగలకు ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. ఈ ఉగాది నుంచి హెల్త్‌ కార్గుల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు వైద్యవిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. వంద శాతం ఉద్యోగులు,…

ఫాప్సీ ఎక్సలెన్సీ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం

హైదరాబాద్‌ : రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఏటా ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డుల కార్యక్రమం నిర్వహణకు తెరలేచింది.సూక్ష్మ, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఈ అవార్డులకు నామినేషన్లు కోరుతున్నట్లు ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి…

వైఎస్‌కు రు. 500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి చెప్పారు

తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ హైదరాబాద్‌ : వైఎస్‌కు రూ. 500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి జనార్దన్‌రెడ్డి సీబీఐ విచారణలో అంగికరించారని, గాలి ఇచ్చిన రూ. 500 కోట్లను వైఎస్‌ ఎన్నికల ఖర్చుగా వినియోగించారని తెదేపా నేత…

బొగ్గు కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదు : సీబీఐ

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఎలాంటి పారదర్శకత పాటించలేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. 2006-09 మధ్య బొగ్గు గనులు కేటాయించిన సంస్థల అధికార పత్రాల పరిశీలన జరగలేదని పేర్కొంది. మరోవైపు బొగ్గు కుంభకోణంపై సీబీఐ తుది…