Thursday, 19 November 2026

హైదరాబాద్

గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. యూపీఏకే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని…

రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. డీజీపీ దినేశ్‌రెడ్డి, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్‌ డీజీలు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

కాకినాడలో అగ్నిప్రమాదం : వంద ఇళ్లు దగ్థం

కాకినాడ : కాకినాడలోని ఇంద్రపాలెంలో శ్రీనివాస ప్రైవేటు పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వంద ఇళ్లు దగ్థమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పుతోంది. మంటల్లో గ్యాస్‌ సిలెండర్లు పేలుతుండడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

మహిళల ఉద్యోగాల్లో వారినే నియమించాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీలో మహిళలకు కేటాయించిన ఉద్యోగాల్లో వారినే నియమించాలని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఎల్బీనగర్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ మహిళా కండక్టర్ల, మహిళా ఉద్యోగులతో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన…

రాష్ట్రవ్యాప్తంగా 21 మాల్‌ప్రాక్టీన్‌ కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలో 21 మందిపై మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్‌ తెలిపారు. మొదటిరోజు పరీక్షకు 92.57 శాతం హాజరు నమోదైనట్లు ఆయన తెలిపారు.

జంటనగరాల్లో పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్‌: నిఘా వర్గాల హెచ్చరికలతో జంటనగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేవాలయాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ…

ఎయిర్‌ ఏసీయా -టాటా కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ : మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏసియా సంస్థ భారత్‌కి చెందిన టాటా గ్రూపుతో కలిసి ప్రారంభించ తలపెట్టిన కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎయిర్‌ఏసియా ప్రతిపాదన ఆమోదం పొందిందని ఎఫ్‌డీఐ విధివిధానాల ప్రకారం 49…

జహీరాబాద్‌ చేరుకున్న సీఎం

జహీరాబాద్‌: ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చేరుకున్నారు. జహీరాబాద్‌ వద్ద మహీంద్రా ట్రాక్టర్‌ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.

సింహాద్రి 3వ యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

విశాఖపట్నం : విశాఖలోని సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మెదక్‌: ఇందోళ్‌ మండలంలోని సంగుపేట గ్రామంలో కొండగారి సాయిలు అనే ఇంటర్‌ విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు..  పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని మనస్తాపంతో సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపిస్తున్నారు. జోగిపేటలోని క్రాంతి జూనియర్‌ కళాశాలలో…