Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

కర్నూలు : ఏసీబీ వలకు ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ చిక్కారు. ఓ భూవివాదానికిసంబంధించి దరఖాస్తుదారుని నుంచి రూ. 90 వేల లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ రామ్మూర్తిని  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు…

హైకోర్టు ప్రాంగణంలో పొన్నాలను అడ్డుకున్న తెలంగాణ న్యాయవాదులు

హైదరాబాద్‌: హైకోర్టు ప్రాంగణంలో మంత్రి పొన్నాలను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై అధిష్ఠానం, ముఖ్యమంత్రిని ప్రశ్నించకపోవటంపై న్యావాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పరిశీలించిన పార్లమెంటు అధికారుల బృందం

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ప్రతిష్ఠించే ఎన్టీఆర్‌ నమూనా విగ్రహాన్ని పార్లమెంటు అధికారుల బృందం పరిశీలించింది. దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌లో విగ్రహ రూపశిల్పి మాయాచారి ఇంటిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వారు పరిశీలించారు.

తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం : గండ్ర

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని భూపాలపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. యువత బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం కావాలన్నపుడు తమకు నిరాశ కలిగిందన్నారు.…

ముగిసిన టి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం

హైదరాబాద్‌: సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల  సమావేశం ముగిసింది. ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సోనియాకు లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

సంగారెడ్డి కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మారుతీదేవి కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు శుక్రవారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,920, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,800గా ఉంది. కిలో వెండి ధర…

టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌: సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు., తెలంగాణ సాధన, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు.