Wednesday, 18 November 2026

హైదరాబాద్

దోషులను వెంటనే అరెస్టు చేయాలి : తలసాని శ్రీనివాసయాదవ్‌

హైదరాబాద్‌: ఆల్వాల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసంపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలి వద్ద పార్టీ నేతలు తలసాని శ్రీనివాసయాదవ్‌, మహేందర్‌రెడ్డి కార్యాకర్తలతో కలిసి నిరసనకు దిగారు. జవహర్‌నగర్‌, బాలాజీనగర్‌లో దుకాణాలను కార్యకర్తలు మూసివేయించారు. దోషులను గుర్తించి పోలీసులు…

ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి

ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. కూలిన వంతెన  శిధిలాల కింద కూలీలు…

స.హ కమిషనరల నియామకంపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నలుగురి నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 11న విచారణ చేపట్టనుంది. సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం…

నల్లమలకు బయలుదేరిన స్పీకర్‌ బృందం

హైదరాబాద్‌: నల్లమల అటవీప్రాంతంలో చెంచుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ మహబూబ్‌నగర్‌ జిల్లాకు బయలుదేరింది. జిల్లాలోని మన్ననూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల అభివృద్ధి, తాగునీరు, గృహ నిర్మాణాలు,…

ఢిల్లీలో జనవరి నుంచి 60 స్వైన్‌ప్లూ కేసులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో స్వైన్‌ప్లూ మరోసారి విజృంభిస్తోంది. ఈ జనవరి నుంచి వివిధ ప్రాంతాల్లో 60 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఏకే వాలియా తెలిపారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. స్వైన్‌ప్లూపై ప్రభుత్వం…

హైకోర్టు ముందు హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా జనగామా శాసనసభా స్థానానికి 2009లో జరిగిన సాధారణ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ కోసం మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టుకు రెండో రోజు కూడా హాజరయ్యారు. జనగామా స్థానం నుంచి పొన్నాల ఓట్లను తారుమారు…

సంగారెడ్డి కోర్టుకు అబ్బరుద్దీన్‌ తరలింపు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నేడు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఆయన్ను ఉదయం 7 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. విచారణ పూర్తయిన…

ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం.. తెదేపా నేతల ఆందోళన

హైదరాబాద్‌: ఆల్వాల్‌లోని జవహర్‌నగర్‌లో నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని  ధ్వంసం చేశారు. దీంతో తెదేపా నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దాదాపు 15 అడుగులు ఉన్న విగ్రహాన్ని పగలగొట్టడంపై కార్యకర్తలు మండిపడ్డారు. దోషులను గుర్తించి…

ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి తడిసిన పత్తి

వరంగల్‌ : ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి పత్తి బస్తాలు తడిసిపోయాయి. వందలాది బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు ధర్నా చేపట్టారు.

కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని మెట్రో వద్ద ఓ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దుకాణం పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.