Tuesday, 17 November 2026

హైదరాబాద్

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ  : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు పలికాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపినట్లు భేటీ అనంతరం ఆ…

నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. వైకాపా ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదని ఎంఐఎం మాత్రం ఉంటే…

రేపు తెలంగాణ బంద్‌ : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు నిస్తున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు.

ముగిసిన అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీ ముగిసింది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే…

కాంగ్రెస్‌ది దాటవేత ధోరణి : వినోద్‌

న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రజస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు బాధ్య తాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెరాస నేత వినోద్‌ అన్నారు. తెలంగాణపై ఏదీ చెప్పకుండా కాంగ్రెస్‌ దాటవేత ధోరణి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో…

కాంగ్రెస్‌ అభిప్రాయం ఎందుకు చెప్పలేకపోతోంది? : రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభిప్రాయం చెప్పలేకపోతోందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగోనాలని పార్టీ…

కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను నిలదీస్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణ డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు ఆయన నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ,…

నార్త్‌ బ్లాక్‌కు చేరుకుంటున్న ప్రతినిధులు

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీ కి హాజరయ్యేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు నార్త్‌బ్లాక్‌లోని హోంమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. 11.30కు హోంమంత్రి షిండే విలేకరుల సమావేశం ఏర్పాటు…

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ 128వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు , పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.