Monday, 16 November 2026

హైదరాబాద్

ప్రభుత్వం స్పందించకపోతే పాలన స్తంభింపచేస్తాం

హైదరాబాద్‌ : పదో వేతన సంఘం, కేసులు ఎత్తివే, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో పాలనను స్తంభింపచేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. జనవరిలోగా ఆరోగ్య కార్డులు ఇవ్వకపోతే చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని…

వైఎస్‌ కాలంలోనే అవినీతి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అవినీతి జరిగిందని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. వైఎస్‌ హయాంలో పనిచేసిన మంత్రులు తమ పదవుల్లో కొనసాగాలా వద్దా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.

షీలాదీక్షిత్‌ ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : విద్యార్థినిపై అత్యాచారం ఘటనఉ నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం పలువురు విద్యార్థులు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేనన్లను ప్రయోగించారు.

అన్ని పార్టీల వైఖరి స్పష్టం చేయాలి : కొండ్రు

శ్రీకాకుళం : తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని మంత్రి కొండ్రు మురళి కోరారు. కాంగ్రెస్‌తో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఎవరు మాట్లాడినా అది తమ వ్యక్తిగత అభిప్రాయం కిందే పరిగణించాలని…

ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌కి బయలు దేరిన భారత్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18: డిఫెండింగ్‌ ఛాంపి యన్‌ భారత హాకీ జట్టు ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇవాళ దోహా బయలుదేరింది. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నేపథ్యంలో అందరి చూపు టీమిండియాపైనే…

సినీహీరో యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కర్ణాటక : ఉల్లాసంగా… ఉత్సాహంగా సినిమా కథానాయకుడు యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లా శిరాలో బుధవారం ఉదయం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ వచ్చేందుకు…

రాజ్యసభకు సచిన్‌ను ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : రాజ్యసభకు క్రికెటర్‌ సచిన్‌ను ఎంపిక చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సచిన్‌ను ఏవిధంగా రాజ్యసభకు నామినేట్‌ చేశారని రామ్‌గోపాల్‌ సింగే అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే రాజ్యాంగం…

వరంగల్‌లో విద్యార్థుల ర్యాలీ

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ వరంగల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, సంయుక్త కలెక్టర్‌ ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులతోపాటు ప్రజలు కూడా పాల్గొన్నారు.

కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకోవాలి : కేటీఆర్‌

కరీంనగర్‌: కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకొని చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సూచించారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీ తరపున విజయమ్మ, టీడీపీ తరపున చంద్రబాబు పాల్గొంటే సోనియా, బొత్స కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని…

అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ : యువతిపై సామూహిక అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీచేసింది. బాధితురాలు, ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.