Sunday, 15 November 2026

హైదరాబాద్

దిగ్విజయ్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : భాజపా అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 21న హాజరు కావాలని దిగ్విజయ్‌సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఎంఐఎం నేతల పై తెరాస ఫిర్యాదు

హైదరాబాద్‌: పాతబస్తీలో రెచ్చగెట్టే ప్రసంగాలు చేశారని ఎంఐఎం నేతలపై తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఈ పర్యటనలో చాలా నేర్చుకున్నాను : సూకీ

అనంతపురం: భారతదేశ పర్యటనలో తాను చాలా పాఠాలు నేర్చుకున్నానని మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని…

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు: 47మంది విద్యార్థుల మృతి

ఈజిఫ్ట్‌: వేగంగా వెళుతున్న రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 47 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన దక్షిణ ఈ సంఘటన దక్షిణ ఈజిఫ్ట్‌లో చోటుచేసుకుంది. చిన్నారులంతా 4నుంచి 6 సంవత్సరాలలోపు వారే. అల్‌-మండర గ్రామం…

అంచనాల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాల్లో శనివారం అంచనాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో రవాణాశాఖ, ట్రాఫిక్‌ విభాగాలపై సమీక్షలు జరుపుతారు.

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, ఈ సమావేశానికి టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హాజరయ్యారు. సచివాలయం ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ నరేందర్‌రావు సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగుల…

ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధం : వెంకయ్య

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఎంఐఎం రాజకీయపార్టీ కాదని, దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ దేశాన్ని విదేశాలకు తాకట్ల పెడుతుందని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణ సాధన కోసం దేనికైనా రెడీ : మంత్రి బసవరాజు సారయ్య

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం  దేనికైనా రెడీ అని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సారయ్య తెలియజేశారు.  ఈసారి కనుక తెలంగాణ రావడం…

కర్ణాటకలోనది సంకీర్ణ ప్రభుత్వం కాదు: ఈశ్వరప్ప

బెగుళూరు: కర్ణాటకలో ఎటువంటి సంకీర్ణ ప్రభుత్వం లేదని, భాజపానే పాలనలోనే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్‌. ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో కేజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందన్న పార్టీ రెబల్‌ నేత యడ్యారప్ప చేసిన ఆరోపణల్ని…

28 మంది డీఎస్పీలకు స్థానచలనం

హైదరాబాద్‌: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ అయ్యాయి.