Sunday, 15 November 2026

హైదరాబాద్

భారీ వర్షంతో స్వల్పంగా కుంగిన వంతెన

శ్రీకాకుళం: ఎడతెరిపి లేని వర్షాలతో పాలకొండ- పార్వతీపుం రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పాలకొండలోని గజాలాఖానా వంతెన స్వల్పంగా కుంగింది,.దీంతో ఈ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ముంపు ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలో ఉన్న సీఎం ఫోన్‌ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను సంప్రదించి పరిస్థితిని…

వరద కారణంగా పలు రైళ్లు రద్దు

హైదరాబాద్‌: పలు జిల్లాల్లో వరద నీటి ఉద్థృతి కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-విశాఖ రత్నాచల్‌, గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-సికింద్రాబాద్‌ జన్మభూమి, విజయవాడ-విశాఖ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. వీటితో పాటు…

అంధకారంలో కోనసీమ వాసులు

తూర్పుగోదావరి: ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో కోనసీమలో పలు నివాస ప్రాంతాలు నీటి మునిగాయి. నిన్న రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తుని వద్ద వరద ఉద్థృతి పెరగడంతో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను…

నేటితో ముగియనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

న్యూయార్క్‌:: ఆమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 6న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాండీ భీకర తుపాను కారణంగా ప్రచారానికి తాత్కాలిక విరామం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామ,…

హిమాచల్‌లో అసెంబ్లీ ఓటింగ్‌ ప్రారంభం

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ కోసం 7,253 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్‌ పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ…

యానం జలమయం

యానం: భారీ వర్షాల కారణంగా యానం పరిసర ప్రాంతాల్లో వృద్ధ గౌతమీ నదికి వరద పోటెత్తింది, వరద నీరు నివాస ప్రాంతాల్లోకి వచ్చి చేరడంతో 10 వేల కుటుంబాలు నీటమునిగాయి. పలు చోట్ల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు…

ప్రణబ్‌ ముఖర్జీతో ఖలీదా జియా భేటీ

ఢిల్లీ: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి భేగం ఖలీదా జియా  శనివారం నాడిక్కడ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. ఇరుగుపొరుగైన బంగ్లాదేశ్‌తో చక్కటి సంబంధాలకు భారత్‌ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రణబ్‌ముఖర్జీ ఈ సందర్భంగా ఆమెకు చెప్పారు. పరస్పర…

ఉద్థృతంగా శారదా నది

విశాఖ: జిల్లాలో భారీ వర్షాలకు శారదా నది ఉద్థృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజువాక-ఎలమంచిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.