Sunday, 15 November 2026

హైదరాబాద్

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల బంగారం, 3కిలోల వెండి, రూ 10 వేల నగదును దోచుకెళ్లారు.…

8 నెలలైనా అందని రుణాలు

హైదరాబాద్‌: బీసీ కార్పొరేషన్‌, బీసీ కులాల సహకార  సమాఖ్యలకు భారీస్థాయిలో నిధులు కేటాయించినట్లు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయటంలేదని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం అన్నారు. బీసీ కార్పోరేషన్‌తోపాటు రజక, నానయిబ్రహ్మణ, వడ్డేర, ఉప్పర,…

మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయం

విజయవాడ: కేంద్రమంత్రివర్గంలో ఏపీ నుంచి ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యాపారులకు కాకుండా బడుగు బలహీనవర్గాలకు చోటు కల్పించటం మంచి సంప్రదాయమన్నారు. కాంగ్రెస: అధికారపక్షం ఇంట్లో ఈగల మోత బయట పల్లకి…

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. ఆదివారం కీరంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల మద్య అనైక్యత…

తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలూకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

2013లో బీజేపీ పాదయాత్ర:కిషన్‌రెడ్డి

గన్నవరం: రాష్ట్రంలో అసలైన పాదయాత్ర 2013లో బీజేపీ చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రెండు పాదయాత్రలు ప్రజలతో సంబంధం లేకుండా కేవటం…

గాంధీభవన్‌లో ‘ఔట్‌రీచ్‌’ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: దళిత, గిరిన, మైనార్టీ వర్గాలను పూర్తిగా దగ్గరికి చేర్చుకున్నప్పుడే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న కల నెరవేరుతుందని యువజన కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. ఈ వర్గాలను యువజన కాంగ్రెస్‌ ఆకర్షించేందుకు ఉద్దేశించిన ఔట్‌రీచ్‌ కార్యక్రమాన్ని గాంధీ భవన్‌లో ప్రారంభించారు.

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్‌

ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్‌ఖుర్షిద్‌ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్‌ తెలిపారు.

నవంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్న చిరంజీవి

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తవటంతో రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించడానికి సమాయత్తమవుతున్నారు. నవంబర్‌ 1న కేంద్ర పర్యాటక శాఖ(స్వతంత్ర) మంత్రిగాచిరంజీవి బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 11గంటలకు సమాచార సహాయ మంత్రిగా కిల్లికృపారాణి బాధ్యతలు…