Sunday, 15 November 2026

హైదరాబాద్

బాబు యాత్రకు మద్దతుగా పాదయాత్ర

కోత్తగూడెం: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా … మీకోసం పాదయాత్రకు మద్దతుగా కోత్తగూడెం నియోజకవర్గంలో అపార్టీ నేత కిలారు నాగేశ్వరావు సోమవారం పాదయాత్ర నిర్వహించారు కోత్తగూడెం నుంచి పాల్వంచ వరకు దాదాపు 15కి.మీటర్లు వందలాది మంది…

నేటి నుంచి ఒక్కపూటే ఇంధన విక్రయాలు

  ప్రోద్దుటూరు (మెయిన్‌బజార్‌): న్యూస్‌టుడే : జిల్లాలో పెట్రోల్‌ బంకులు సోమవారం నుంచి ఒక్కపూటే పనిచేస్తామని జిల్లా పెట్రోల్‌బంకు యాజమానుల సంఘ అధ్యక్షుడు వర్రాగురివిరెడ్డి తెలిపారు. అదివారం అయన తన బంకులో బంకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.…

తెలంగాణ పై కేంద్రానికి చిత్తశుద్ధి కరువు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కారంపై కేంద్రానికి చిత్తశుద్థి లేదని తెలంగాణ రాజకీయ ఐకసా ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఈ నెల 16 ప్రధాని పర్యటనకు  నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసనలు…

అవిశ్వాసం గురించి మాట్లాడే అర్హత వైకాపాకు లేదు: తెదేపా నేత సోమిరెడ్డి

నెల్లూరు: అవిశ్వాసమంటే అర్థం తెలియని వారు దాని గురించి మాట్లాడటం అవివేకమని వైకాపానుద్దేశించి తెదేపా నేత సోమిరెడ్డి  చంద్రమోహన్‌ రెడ్డి నెల్లూరులో వ్యాఖ్యానించారు. షర్మిల పాదయాత్ర గురించి స్పందిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమె…

పోలవరం టెండర్ల వివాదంపై విచారణ వచ్చేనెల 5కు వాయిదా

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల వివాదంపై వచ్చేనెల 5కు హైకోర్టు వాయిదా  వేసింది. ఈ వివాదంపై నవంబరు 5లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

రోడ్లు, భవనాలశాఖపై అంచనాల కమిటీసమీక్ష

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాలులో రోడ్లు,భవనాల శాఖపై అంచనాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లకు రావాల్సిన కేంద్ర నిధులు ఆగిపోవటంపై త్వరలో ఢిల్లీ వెళ్లాలని అంచనాల కమిటీ నిర్ణయించింది. ట్యాంక్‌బండ్‌, దుబ్బాకలోని సౌరవిద్యుత్‌…

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగుల ఆందోళన

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. ధృవీకరణ పత్రం పేరిట ఆర్యోగ సేవలను వైద్యులు నిలిపివేశారు. రోగులకు వైద్యం అందించాలని రోగుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

చంచల్‌గుడా జైలులో కుక్కరు పేలి ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌: చంచల్‌గుడా జైలులో కుక్కరు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు, ఒక వార్డర్‌ గాయపడ్డారు. ఈ ఉదయం వంట చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు.

సీబీఐకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి

కరీంనగర్‌: భవిష్యనిధి కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికాడు. రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఆంజనేయులును సీబీఐ అధికారులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

పేకాటరాయుళ్ల అరెస్టు

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి ఉప్పర్‌గూడలోని పేకాట గృహంపై పోలిసులు దాడి చేసి 20 మంది పేకాటరాయిళ్లను అరెస్టు చేశారు. నెల రోజులుగా ఇక్కడ పేకాడుతున్నట్లు వి:్వసనీయ సమాచారంతో మల్కాజ్‌గిరి ఏసీపీ అధ్వర్యంలో పోలిసులు వారిని ఈ తెల్లవారుజామున అరెస్టు…