Saturday, 14 November 2026

హైదరాబాద్

ఢిల్లీలో గాంధీజీకి ఘన నివాళి

న్యూఢిల్లీ: మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్‌ నేత అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన…

తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరిగింది.: పాల్వయి

ఢిల్లీ: ఈరోజు మీడియాతో పాల్వయి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరగలేదన్ని అన్నారు.  తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం బస్సులను రైళ్లను రద్దు చేసిందని అన్నారు.

తెలంగాణ కోసం శంకర్రావు మౌనదీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్షకు పూనుకున్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.

బాపుఘాట్‌ వద్ద కోదండరాం మౌనదీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతదితర నేతలు బాపు ఘాట్‌ వద్ద గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే మౌనదీక్షను ప్రారంభించారు. తెలంగాణ కవాతు సంర్భంగా పోలీసు చర్యలను నిరసిస్తూ ఈ దీక్షను చేపట్టినట్లు కోదండరాం తెలియజేశారు.…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

  చేగుంట : స్థానిక జైపాన్‌ కూడలి వద్ద అర్టీసీబస్సు. కారు ఢీకోనడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.

బాపు పుట్టిన రోజే పోలీసుల కీచక పర్వం

ఆదిలాబాద్‌: ”అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ” అని చెప్పిన గాంథీజీ పుట్టిన రోజే పోలీసుల ఓ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు… బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీలో పోలీసులు దారుణానికి ఒడిగట్టారు.…

బుడమేరులో పెరుగుతున్న వరద ఉద్దృతి

జీకోండూరు :కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకోండూరు మండలంలోని బురమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరుపై గలగలేరు వద్ద నిర్మించిన రెగ్యులెటర్‌ వద్ద మంగళవారం ఉదయం 6.5అడుగుల నీటి మట్టం చేరింది మరో మూడడుగులు దాటితే…

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

మార్చ్‌పై పోలీసుల హింసపై తెలంగాణ జేఏసీ మౌన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై పోలీసులు జరిపిన దమనకాండకు నిరసగా ఉదయం లంగర్‌హౌస్‌ బాపుఘాట్‌ వద్ద తెలంగాణ జేఏసీ మౌన దీక్ష చేపట్టనుంది. తెలంగాణ మార్చ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చినట్లే ఇచ్చి మరోవైపు కుట్ర పూరితంగా వ్యవహరించి ప్రజలపై లాఠీ…

కుటుంబసభ్యులతో కలిసి హిందూపురం బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్‌: నేటి నుంచి ప్రాంభం కానున్న పాదయాత్ర కోసం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా హైదరాబాద్‌ నుంచి హిందూపురం పట్టణానికి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం జిల్లా…