Tuesday, 10 November 2026

హైదరాబాద్

వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లాల్లో ప్రత్యేక…

ఇల్లెందులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఇల్లెందు: గత మూడురోజులుగా ఇల్లెందు ఏరియాలో కురిసిన వర్షాలతో సుమారు రూ. 3 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శనివారం రాత్రి షిప్టునుంచి జేకే5 ఉపరితల గని, కోయగూడెం ఓ పెన్‌కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

తాలిపేరు గేట్లు ఎత్తివేత

చర్ల: ఖమ్మం జిల్లాలోని తాలిపేరు  ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న  వర్షాలతో ప్రాజెక్టులోకి  నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి భారీగా వరదనీరు…

చిత్తూరు జిల్లాలో నలుగురు ఆత్మహత్య

రొంపిచర్ల: చిత్తూరు  జిల్లా రొంపిచర్ల మండలం ఫజులులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరందరూ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

పాక్‌ జాతీయుడి అరెస్టు

శ్రీనగర్‌: దేశంలో దొంగచాటుగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని పోభద్రతాదళాలు అరెస్టుచేశారు. పూంచి సెక్టర్‌ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌జాతీయున్ని అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు అతన్ని విచారిస్తున్నాయి.

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 315 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే…

తెలంగాణపై కేంద్రం దృష్టి : బొత్స

న్యూఢిల్లీ, జూలై 21 : తెలంగాణపై కేంద్రం దృష్టి సారించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని…

మారుతి సుజుకీ కంపెనీ లాకౌట్‌

హర్యానాలో కార్మికుల నోట్లో మన్ను హర్యానా : హర్యానా రాష్ట్రంలోని మానేసార్‌లో కిందటి బుధవారం మారుతి సుజుకి కంపెనీలో జరిగిన ఘర్షణలో జనరల్‌ మేనేజర్‌ అవనీష్‌ కుమార్‌ మృతి చెందిన తెలిసిందే. ఈ ఘర్షణకు కారణమైన వారిని అదే…

2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు మద్దతు

న్యూడిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఏదైన ఏర్పడితే మద్దతిస్తామని అన్నా బృందం తెలిపింది. 2014లో విప్లవం రానుందని.. అది పార్టీ లేదా ముఖాలు మారడం కాదని, వ్యవస్థనే మార్చుతుందని అన్నా బృందం సభ్యుడు అరవింద్‌…

రెచ్చగొట్టే వస్త్రధారణ వద్దు

ఇండోర్‌: మహిళ వస్త్రధారణ, వ్యవహార శైలిపైనే వారి భద్రత ఆధారపడి ఉంటుందని మధ్య ప్రదేశ్‌ మంత్రి వ్యాఖ్యానించారు. మహిళల ఫ్యాషన్‌, జీవనశైలి నడవడిక భారత సంప్రదాయాలకు తగినట్లు ఉండాలి. ఇతరులను రెచ్చగొట్టేలా వారు దుస్తులు ధరించకూడదు. అని మధ్య…