Saturday, 14 November 2026

నిజామాబాద్

150 పళ్లేలు పంపిణీ

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలంలోని గిడ్డా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం 150 పళ్లేలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, ఉపాధ్యాయ బృందం…

రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలకు గాయాలు

నవీపేట గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ గాయపడిన సంఘటన మండలంలోని అబ్బాపూర్‌ ఎం గ్రామ మూల మలుపు వద్ద చోటుచేసుకుంది. సత్య నారాయణ, స్వప్న దంపతులు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యారు. నవీ పేట నుంచి జానకం పేట వెళ్తున్న…

చిరుతపులి కోసం అటవీ శాఖాధికారులు గాలింపు

జుక్కల్‌:మండలంలోని కౌలాజ్‌కోట శివారులో చిరుతపులి సంచరిస్తోంది. దాన్ని పట్టుకొనేందుకు అటవీ శాఖాధికారులు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. రేంజ్‌ అధికారి రాజయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల బృందం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంది.

శిక్షణతో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి

డిచ్‌పల్లి: రిక్రూట్‌మెంట్‌ కానిస్టేబుళ్లందరూ అధికారులు ఇచ్చే శిక్షణతో తమ నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలని, ఈ శిక్షణ విధినిర్వహణకు ఎంతో దోహదపడుతుందని ఏపీ ఎస్పీ బెటాలియన్స్‌ ఐజీ కిషోర్‌కుమార్‌ సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని ఏడో బెటాలియన్‌లో రిక్రూట్‌ కానిస్టేబుల్స్‌ పరేడ్‌ను…

భాజపా జెండా ఆవిష్కరణ

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజీవాడీ చౌరస్తాలో శనివారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బానాల లక్ష్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ పార్టీ హిందూ సంస్కృతిని పరిరక్షిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీను…

భజపా ఆర్థిక సాయం

సదాశివ్‌నగర్‌: మండలంలోని రామారెడ్డి గ్రామంలో ఈనెల 4న విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు లచ్చయ్య కుటుంబానికి శనివారం భాజపా ఆధ్వర్యంలో రూ. 3వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌…

ఐదు నెమళ్ల మృతి

బాల్కొండ: బాల్కొండలోని చెరువులో 5నెమళ్ల శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. చెరువు వద్దకు నీరు తాగడానికి వచ్చిన నెమళ్ల వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయాయా లేక పొలంలో చల్లిన గుళికలు తిని చనిపోయాయా అనేది తేలాల్సి ఉంది.…

ఉచిత కంటి వైద్య శిబిరం

బాల్కొండ: బాల్కొండలో శుక్రవారంఆర్మూర్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసాద్‌గౌడ్‌ పాల్గొని కంటి రోగులకు వైద్య పరీక్షలు చేశారు. కంటిలో మోతి బిందు ఉందని తేలిన 5గురికి ఉచిత…

జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పలువురు నివాళులు

ఆర్మూర్‌: జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలో ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ కంశెట్టి గంగాధర్‌, భాజపా తెలంగాణా ఉద్యమకమిటీ వైన్‌ ఛైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌, వైకాపా బాలకొండ నియోజక…

ఎత్తిపోతల పథకాలను సందర్శించిన మాజీ స్పీకర్‌

ఆర్మూర్‌:మండలంలోని మింథిని సిద్ధాపూర్‌, గ్రామాల ఎత్తిపోతల పథకాలను మాజీ స్పీకర్‌ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు సాగునీటి సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ధేశిత ఆయట్టుకు నీరందించాలని సంబంధిత…