Saturday, 14 November 2026

నిజామాబాద్

ఓన్నాదిపేట్‌లో దొంగతనం

సిరికొండ: మండలంలోని ఓన్నాది పేటలో ఆదివారం రాత్రి రెండు కిరాణ దుకాణాలు, బార్బర్‌ దుకాణంలో దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణాల తాళాలు పగుటకొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. గంగారెడ్డికి చెందిన ఎరువుల దుకాణంలో…

తెదేపా నాయకుల రాస్తారోకో

సిరికొండ: మహరాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరును నిరసిస్తూ తెదేపా నాయకులు సోమవారం సిరికొండలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడి

సిరికొండ: మండలంలోని పొన్నాజిపేట్‌ గ్రామంలో రైతులు విద్యుత్‌కోతలను నిరసిస్తూ 33/11 కెవిఏ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని  ముట్టడించారు. గత నాలుగైదు రోజులుగా వ్యవసాయానికి త్రీ ఫెజ్‌ విద్యుత్తును మూడు. నాలుగు గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. 2ఫేజ్‌ విద్యుత్తు కోతలను…

పురుగుల మందు తాగి ఒకరి మృతి

నాగిరెడ్డిపేట: మండలంలోని జప్తి జాంకంపల్లి గ్రామ శివారులో మజిదేవుని గడ్డ తండాకు చెందిన రమావత్‌ గోప్యా (26) శనివారం ఉదయం పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

రెండు మిద్దె ఇళ్లు దగ్థం

నాగిరెడ్డిపేట: మండలంలోని జలాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన చేవెళ్ల కిష్టాగౌడ్‌, చెవెళ్ల శంకర్‌ గౌడ్‌లకు చెందిన మిద్దె ఇళ్ల శనివారం తెల్లవారు జామున విద్యుదాఘాతంతో దగ్థమయ్యాయి. ప్రమాదంలో బియ్యం, ఎరువుల బస్తాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.30వేల…

దాచిన కలప పట్టివేత

సిరికొండ: మండల కేంద్రంలోని లింగారెడ్డి అనే రైతు కొట్టంలో అక్రమంగా దాచిన కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రూ2 లక్షల విలువైన 150 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఇంగల్‌ వాయి రేంజి అధికారి నాగగౌడ్‌ తెలిపారు.

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నిజామాబాద్‌ : నిజమాబాద్‌ జిల్లాలోని అర్సపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.

పోలీసుల అధికారులతో ఐజీ సమీక్ష

కామారెడ్డి: కామారెడ్డి పోలీసు కార్యాలయంలో ఐజీ రాజీవ్‌ రతన్‌పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టామని…

పోలీసుల అధికారులతో ఐజీ సమీక్ష

కామారెడ్డి: కామారెడ్డి పోలీసు కార్యాలయంలో ఐజీ రాజీవ్‌ రతన్‌పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టామని…

శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు

బీర్‌కూర్‌ రూరల్‌: గ్రామంలో అల్లర్లకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని బాన్సువాడ గ్రామీణ ప్రకాష్‌ సీఐ ప్రకాష్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం బీర్‌కూర్‌ మండలం దుర్కి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఏవైనా సమస్యలు…