Wednesday, 11 November 2026

వరంగల్

సద్గురు శివానందమూర్తి కన్నుమూత 

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 గంటల తర్వాత భక్తుల సందర్శనార్ధం ఆశ్రమంలో శివానందమూర్తి భౌతికకాయం ఉంచనున్నారు.…

వరంగల్ లో భట్టివిక్రమార్క పర్యటన 

వరంగల్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సీఎంలు అధికారం అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో చంద్రులు అధికారంలోకి రావడం… ప్రజల దురదృష్టమని చెప్పారు. ఆరు దశాబ్ధాల పోరాట…

స్చచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభం..

వరంగల్ : జిల్లాలో స్వచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. హన్మకొండ చౌరస్తాలోని అశోక కాంప్లెక్సు వద్ద డీఐజీ మల్లారెడ్డి పాల్గొన్నారు.

కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ ఓటమి:సర్వే సత్యనారాయణ

వరంగల్: పార్టీలో కుమ్ములాటల వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ… సీఎం సీటు కోసం 12 మంది పోటీ పడ్డారన్నారు.…

గాడిపల్లి చెరువులో పురాతన విగ్రహాలు…

వరంగల్‌:‘మిషన్‌ కాకతీయ’ పనుల్లో భాగంగా ఆదివారం నాడు గాడిపల్లి చెరువులో పూడిక తీస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. వరంగల్‌ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే గాడపల్లి చెరువులో పురాతన విగ్రహాలు బయల్పడటంతో ఆ విగ్రహాలకు చారిత్రక ప్రాధాన్యత…

ఆర్టీసీ బస్సు – డీసీఎం ఢీ..నలుగురు మృతి..

వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు. ఈ ఘటన రఘునాథ మండలం నిడిగొండ వద్ద చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును…

ఆయిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆందోళన…

వరంగల్:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక ధరల భారం మోపుతోందని,…

ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

 వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బచ్చన్నపేట గ్రామంలో ఈ దారణం జరిగింది.బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఎస్ ఆర్ ఎస్పీ కాలువలో పడిన ఆటో: ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని పర్వతగిరి మండలం అన్నారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆటో ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో ఆటో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిక తరలించారు.…