Wednesday, 11 November 2026

వరంగల్

జనగామలో కారు-బైక్ ఢీ:ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని జనగామలో కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ పరారయ్యాడు.

హన్మకొండ బస్టాండ్ లో ఉద్రిక్తత

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల ద్వారా చేరవేస్తుండగా ఆర్టీసీ సిబ్బందికి ప్రైవేట్ డ్రైవర్లకు మధ్య తోపులాట జరిగింది. ఓ ప్రైవేట్ డ్రైవర్‌పై…

ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు టీ.సర్కారు యత్నం

 వరంగల్: ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లాలో భారీగా మోహరించిన పోలీసులు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోలు, బస్టాండ్‌ల వద్ద లాఠీలు ఝులిపించి.. బస్సులను నడిపించాలని వార్నింగ్ ఇస్తున్నారు.…

ఆగివున్న స్కూల్ బస్సు ను ఢీకొన్న లారీ…

వరంగల్: పరకాల బస్టాండు వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…

వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాలు.. దంపతుల మృతి

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడడంతో.. ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో వృద్ధ దంపతులు మృతి చెందారు. విద్యుత్ శాఖ అదికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ వైర్లు తెగిపోయాయని… మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.…

బావిలో పడిన క్రేన్..ఒకరు మృతి..

వరంగల్ : భాంజీపేట శివారులో ప్రాంతంలో ఉన్న ఓ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.

రంగశాయిపేటలో 18 ఇసుకట ట్రాక్టర్లు సీజ్

వరంగల్: రంగశాయిపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 ట్రాక్టర్ల ను వరంగల్ జిల్లా మామునూరు పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్న పేట సమీపంలోని ఆకేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వరంగల్ నగరానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ…